బ్రేకింగ్: జగన్ దూకుడు కొనసాగుతూనే వుంది… మరో కొత్త పథకం!

Thursday, October 17th, 2019, 02:09:20 PM IST

ముఖ్యమంత్రి అయ్యాక సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో దూకుడు పెంచారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలనని, అవినీతి రహిత పాలనని, పారదర్శకత కల్గిన పపాలనని అందిస్తానని జగన్ అన్నారు. దానికి అనుగుణంగా దూసుకుపోతున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు చాల అభివృద్ధి చర్యలు చేపట్టారు. ఇటీవలే రైతు భరోసా పథకం తో పేద రైతులకు అండగా ఉండటం మాత్రమే కాకుండా, రైతు భరోసానే రాష్ట్ర భరోసా అని అన్నారు. నిన్న జరిగిన మంత్రి వర్గ భేటీలో పలు సంక్షేమ పథకాల గురించి చర్చిన జగన్ మోహన్ రెడ్డి, మరో కొత్త పథకాన్ని ప్రారంభించారు.

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా ఉండేందుకు, వైయస్సార్ నవోదయ పథకాన్ని ప్రారంభించారు. జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం లో ఖచ్చితమైన మార్పు తీసుకువచ్చేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రజలందరికి లబ్ది చేకూరేలా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని జగన్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్నో పథకాలు ప్రారంభించి ప్రజలచేత జేజేలు పలికించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి.