ఐస్ క్రీం అమ్ముకునే వ్యక్తితో జగన్ అమెరికాలో భేటీ..ఇదేగా అసలు మజా

Wednesday, August 14th, 2019, 11:19:22 AM IST

తెలుగు నేల మీద పుట్టి తెలుగు మాట్లాడటమే నామోషీగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. అలాంటిది ఒక అమెరికా వ్యక్తి, న్యూజిలాండ్ క్రికెట్ స్టేడియంలో తెలుగులో మాట్లాడుతూ ఐస్ క్రీమ్స్ అమ్ముకోవటం అనేది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో ఆన్ లైన్ లో వీడియో రూపంలో రావటంతో అతను రాత్రికి రాత్రే సెలెబ్రిటీ అయ్యాడు,అతని పేరే ఇసాక్ రిచర్డ్స్. దీనితో ఆయనే సొంతగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తెలుగులో మాట్లాడుతూ దానినే బిజినెస్ గా మలుచుకున్నాడు.

తాజాగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికా పర్యటన చేయనున్నాడు. ఇందులో భాగంగా ఇసాక్ రిచర్డ్స్ తో జగన్ భేటీ కాబోతున్నాడు. సీఎం జగన్ ఇసాక్ రిచర్డ్స్ తో భేటీ కావటం వెనుక కేవలం అతనికి ఉన్న క్రేజ్ చూసి మాత్రమే కాదు. అంతకు మించి బలమైన కారణం మరొకటి ఉందని తెలుస్తుంది. ఇసాక్ రిచర్డ్స్ అసలు తెలుగు ఎలా నేర్చుకున్నాడో చాలా మందికి తెలియదు. విజయవాడ, విశాఖపట్నం లో దాదాపు రెండేళ్లు అతను ఉన్నాడు. ఈ రెండేళ్ల కాలంలో తెలుగు బాగా నేర్చుకున్నాడు.

మరి ఆ సమయంలో ఇక్కడ ఏమి చేశాడో మాత్రం చాలా రహస్యంగా కొందరు ఉంచుతున్నారు. కానీ మనకి వస్తున్నా సమాచారం ప్రకారం అతను క్రైస్తవ మత ప్రచారం చేయటానికి ఆంధ్రాకి వచ్చినట్లు తెలుస్తుంది . ఆ రెండేళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ ప్రచారం చేసినట్లు సమాచారం. దాని తర్వాత న్యూజిలాండ్ వెళ్ళాడు, అతని సొంత దేశం అమెరికా. ప్రస్తుతం అమెరికాలో ఉంటూ తెలుగు వాళ్ళు చేసుకునే ఈవెంట్స్ కి స్పెషల్ గెస్ట్ గా వెళ్లి తెలుగు మాట్లాడుతూ దానిని పార్ట్ టైం జాబ్ గా మలుచుకున్నాడు.

అలాంటి వ్యక్తిని జగన్ కలబోతున్నాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే జగన్ అమెరికా టూర్ ఫిక్స్ కావటానికి ప్రధాన కారకుడు బ్రదర్ అనిల్. అతని పర్యవేక్షణలోనే జగన్ అమెరికా షెడ్యూల్ మొత్తం ఫిక్స్ అయ్యింది. అతనే ఇసాక్ రిచర్డ్స్ తో జగన్ మీటింగ్ సెట్ చేశాడు. బహుశా అతనికి ఉన్న క్రేజ్ క్యాష్ చేసుకుంటూ అతనిని ఆంధ్రాకి మళ్ళి పిలిపించి క్రెస్తవ మత ప్రచారానికి వాడుకుంటారేమో..?