జగన్‌@25:: కొలువుదీరిన కొత్త కేబినెట్ ఇదే..!

Saturday, June 8th, 2019, 01:38:33 PM IST


ఏపీ మంత్రులుగా జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సచివాలయ ప్రాంగణంలో వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మరియు మరికొంత మంది ప్రజాప్రతినిధుల, ఉన్నతాధికారుల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అయితే మంత్రులుగా ముందు ధర్మాన కృష్ణదాస్‌ ప్రమాన స్వీకారం చేయగా ఆ తరువాత మిగతా వారు చేశారు. అయితే తమకు మంత్రివర్గంలో అవకాశం కలిపించిన వైసీపీ అధినేత జగన్‌కు వారందరూ ధన్యవాదాలు తెలుపుకున్నారు.

అయితే ఈ జాబితాను చూస్తుంటే సీఎం జగన్ అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని, సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా మంత్రివర్గాన్ని రూపొందించారని అర్ధమవుతుంది. ఈ సారి మంత్రివర్గంలో చోటు దక్కని నాయకులకు రెండేళ్ల తరువాత తప్పకుండా అవకాశం ఇస్తానని జగన్ చెప్పినట్టు పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. అయితే జగన్ కేబినెట్‌లో మంత్రులగా ప్రమాణస్వీకారం చేసిన వారి జాబితా ఈ క్రింది విధంగా ఉంది.

ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల జాబితా:

1) ధర్మాన కృష్ణదాస్‌
2) బొత్స సత్యనారాయణ
3) పాముల శ్రీపుష్పవాణి
4) అవంతి శ్రీనివాస్
5) పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
6) పినిపె విశ్వరూప్‌
7) కురసాల కన్నబాబు
8) తానేటి వనిత
9) చెరుకువాడ శ్రీరంగనాథరాజు
10) ఆళ్ల నాని
11) కొడాలి నాని
12) వెల్లంపల్లి శ్రీనివాస్‌
13) పేర్ని నాని
14) మేకతోటి సుచరిత
15) మోపిదేవి వెంకట రమణ
16) బాలినేని శ్రీనివాస్‌రెడ్డి
17) ఆదిమూలపు సురేశ్
18) అనిల్‌కుమార్‌ యాదవ్‌
19) మేకపాటి గౌతంరెడ్డి
20)పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
21) నారాయణ స్వామి
22) బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
23) గుమ్మన జయరామ్‌
24) అంజాద్‌ బాషా
25) మాలగుండ్ల శంకర్‌ నారాయణ