అమెరికా టూర్ : ఫుడ్ ఖర్చు జగన్ ది, రూమ్ ఖర్చులు గవర్నమెంట్ వి

Wednesday, August 14th, 2019, 02:53:20 PM IST

జగన్ మోహన్ రెడ్డి ఈ శుక్రవారం కుటుంబముతో కలిసి అమెరికా వెళ్తున్నాడు. విజయమ్మ, భారతి, జగన్ మోహన్ రెడ్డి, వాళ్ళ చిన్న కూతురు వర్షా రెడ్డి వెళ్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగతంగా జరుగుతుందని తెలుస్తుంది. జగన్ చిన్న కూతురు వర్షా రెడ్డికి అమెరికా ఇండియానా స్టేట్ లోని ప్రతిష్ఠాత్మక నోట్రెడామ్ యూనివర్శిటీలో సీటు వచ్చింది. ఆమెని జాయిన్ చేపించటానికి జగన్ వెళ్తున్నాడు. ఇప్పటికే జగన్ వాళ్ళ పెద్దమ్మాయి లండన్ లోని ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదువుకుంటుంది.

ఇక ఈ పర్యటన మొత్తం జగన్ యొక్క పర్సనల్ ఖర్చుతోనే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆయనకి సంబంధించిన ప్రతి ఖర్చు సొంత నిధులు ద్వారానే జరుగుతాయి. కాకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకి ఇవ్వాల్సిన భద్రతా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి అవసరం అయ్యే నిధులు మాత్రమే ప్రభుత్వం భరిస్తుందని సీఎం ఆఫీస్ నుండి సమాచారం వచ్చింది. ఈ నెల 24 దాక జగన్ అమెరికాలో ఉంటాడు. ఇప్పటికే ఆయన పాల్గొనపోయే కార్యక్రమాలు ఫిక్స్ అయ్యాయి.

నెల 17వ తేదీన డల్లాస్ లోని హచిసన్ స్టేడియంలో ప్రవాసాంధ్రులతో వైఎస్ జగన్ భేటీ ఉంటుంది. ఇప్పటికే తానా వాళ్ళు దీనికోసం అన్ని సిద్ధం చేసిపెట్టారు. 22వ తేదీన చికాగోలో పారిశ్రామిక వేత్తలతో విస్తృత స్థాయి సమావేశం జరుగనుంది . ఇక జగన్ రాకని పురస్కరించుకొని అమెరికా లో జగన్ మీటింగ్ జరిగే ప్రదేశాల్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయటం జరిగింది.