బిగ్ న్యూస్: హై పవర్ కమిటీ నివేదిక పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

Tuesday, July 7th, 2020, 01:01:32 AM IST

వైజాగ్ లో గత కొద్ది రోజుల క్రితం ఎల్ జీ పాలిమర్స్ విష వాయువు విడుదల కారణం గా 14 మంది ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ ఘటన పై రాష్ట్ర ప్రభుత్వం ఒక హై పవర్ కమిటీ ను ఏర్పాటు చేసింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఒక నివేదిక రూపం లో రాష్ట్ర ప్రభుత్వం కి నేడు అందజేసింది. అయితే ఈ నివేదిక పై సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్ లో ఇక పై తీసుకొనే చర్యలకు ఈ హై పవర్ కమిటీ నివేదిక మార్గదర్శకం అని వ్యాఖ్యానించారు. పరిశ్రమల భద్రత, ప్రజల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. అంతేకాక అవసరమైతే చట్టాలు మారుస్తాం అని వ్యాఖ్యానించారు. కొత్త చట్టాలు తీసుకు వస్తామని అన్నారు. పరిశ్రమలు గ్రీన్, వైట్ కేటగిరీ లుగా మార్చుకోవాలి అని, వాటికి సంబంధించిన శాఖలు అన్ని మరింత పటిష్టంగా పని చేయాలి అని వ్యాఖ్యానించారు. అంతేకాక ఈ కమిటీ నివేదిక ను ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచాలి అని అన్నారు