నేను ఆ పని చేస్తే..టీడీపీ ఖేల్ ఖతం..సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

Thursday, June 13th, 2019, 04:55:59 PM IST

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైస్సార్సీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపూర్ణమైన మెజారిటీ ఇచ్చి గెలిపించారు. అసలు ఇలాంటి ఫలితాలు కూడా సాధ్యమా అనే రీతిలో ప్రజా తీర్పు వచ్చింది. కనీసం వైస్సార్సీపీ నాయకులు కూడా ఈ స్థాయిలో మెజారిటీ వస్తుందని ఊహించలేదు. ఇక ప్రభుత్వ హోదాలో ఎన్నికలకు సిద్దమైన తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే కట్టబెట్టారు.. ఒక దశలో టీడీపీకి ప్రతిపక్షము హోదా లభిస్తుందా..? లేదా..? అనే అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి.

అసెంబ్లీ లో పదో వంతు సీట్లు కలిగివుంటేనే ప్రతిపక్షము హోదా ఉంటుంది. అంటే కనీసం 18 మంది MLA లు పైగా కలిగివుండాలి.. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు ఒక ఐదుగురు మాత్రమే టీడీపీ కి ఎక్కువగా ఉన్నారు. జగన్ కావాలి అనుకుంటే టీడీపీలో డజన్ మంది MLA లు గోడదూకటానికి సిద్ధంగా ఉన్నారనేది సమాచారం. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో జగన్ మాట్లాడుతూ “టీడీపీ నుండి ఐదుగురు MLA లను తీసుకుంటే వాళ్ళకి ప్రతిపక్షము హోదా లేకుండా పోతుందని నాకు చెప్పారు”. కానీ ఆలా తీసుకోవటానికి నేను సిద్ధంగా లేను.

నేను సరే అంటే టీడీపీ ఖాళీ అవ్వటం ఖాయం. కానీ ఇలా అన్యాయంగా MLA లను తీసుకునే పార్టీ కాదు మాది. అలా చేస్తే వాళ్ళకి మాకు తేడా లేదు. ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే రాజ్యాంగ బద్దంగా వాళ్లతో రాజీనామా చేయించి, ఆ తర్వాత మా పార్టీలోకి తీసుకుంటానని జగన్ చెప్పటం జరిగింది. అలా చేయకుండా తీసుకుంటే స్పీకర్ అయినా మీరే వాళ్ళ మీద అనర్హత వేటు వేయండని కోరుకుంటున్న అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పటం జరిగింది .