దద్దరిలిపోతున్న అసెంబ్లీ..జగన్ విశ్వరూపం

Friday, July 12th, 2019, 12:48:01 PM IST

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలతో అసెంబ్లీ అట్టుడికిపోతోంది. నిన్న మొదటి రోజే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఒక రేంజు లో జరిగింది. దీనికి కొనసాగింపుగా రెండో రోజు సభ ప్రారంభమైన వెంటనే సున్నా వడ్డీ రుణాల మీద చర్చలు నడుస్తాయి. చంద్రబాబు హయాంలో ఆ పధకం బాగానే అమలుచేశామని టీడీపీ నేతలు చెప్పటంతో, వాళ్ళు చెప్పవాణ్ణి అబద్దాలు వాళ్ళు అసలు దానిని అమలు చేయలేదంటూ వైసీపీ వాదిస్తుంది. ఈ క్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి 2014 నుండి 2019 దాక టీడీపీ సున్నా రుణాలపై ఎంత ఖర్చు పెట్టిందో లెక్కలు చూపిస్తూ మాట్లాడుతున్నాడు.

ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ చెప్పేవన్నీ సత్యదూరాలంటూ పెద్ద ఎత్తున అసెంబ్లీలో జగన్ మాటలకి అడ్డు తగిలారు. స్పీకర్ ఎంత నచ్చచెప్పినా కానీ వాళ్ళు మాట వినలేదు. ఒక పక్క లెక్కలు గురించి చెపుతున్న జగన్ లో అసహనం పెరిగిపోయి ఒక్కసారిగా టీడీపీ నేతల మీద ఎదురుదాడికి దిగారు. కనీసం బుద్ధి, జ్ఞానం వున్నవాళ్లు ఎవరు ఇలా చేశారు. అసలు మీకు అసెంబ్లీ లో ఎలా నడుచుకోవాలో తెలియదు. మీలాంటి వాళ్ళు గెలిచి అసెంబ్లీకి రావటం మా కర్మ. సీఎం గా నేను మాట్లాడుతూనే వినే ఓపిక లేని వాళ్ళు మీరేమి ఎమ్మెల్యేలు.

మీరు 23 మంది, మేము 150 మంది ఉన్నాము. మేము కానీ లేచి అరిస్తే మీరు కూర్చున్న స్థానంలో కూడా ఉండలేరు. అచ్చెన్ననాయుడు మనిషి ఇంత లావు పెరిగితే సరిపోదు. బుద్ధి కూడా పెరగాలి, సిగ్గు లేకుండా గోల చేస్తున్నారు. అరవకుండా కూర్చోండి, మీరు కళ్ళు పెద్దవి చేసి చుస్తే ఎవరు ఇక్కడ భయపడరు. ఎక్కువ చేయకుండా కూర్చోండి అంటూ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో హెచ్చరించాడు. దీనితో అసెంబ్లీ లో గందరగోళం ఏర్పడింది. దీనితో స్పీకర్ ఇరు పక్షాలకు సర్దిచెప్పి సభని నడిపించటానికి కృషి చేస్తున్నాడు.