ప్రధాని నరేంద్ర మోడీ కి సీఎం జగన్ లేఖ

Tuesday, June 8th, 2021, 08:24:36 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. గ్రీన్ ఫీల్డ్ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని లేఖలో వివరించారు. ఇళ్ళ నిర్మాణం కోసం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 30 లక్షల మందికి ఇళ్ళ కల్పన లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని పూర్తి గా లేఖలో వివరించారు జగన్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో దశల వారీగా జగన్ ఇళ్ళ నిర్మాణం ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం కి కేంద్ర ప్రభుత్వం సైతం అండగా ఉండే విధంగా లేఖలో పలు విషయాలను ప్రస్తావించడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం లోని పేద మహిళలకు ఇళ్ళ స్థలాల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగు చర్యలు సైతం చేపట్టారు. ఇచ్చిన హామీలను సైతం నెరవేరుస్తూ ఉండటం పట్ల వైసీపీ నేతలు జగన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.