సీఎం జగన్ మాస్టర్ ప్లాన్.. వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయం..!

Wednesday, October 9th, 2019, 03:00:06 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులలోనే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ పాలనతో అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు.

అయితే అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది రోజులలోనే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నిటిని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు. అయితే గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు, అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా, వాహనమిత్ర ద్వారా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం వంటివి అమలు చేసి నిజంగా రికార్డ్ సృష్టించాడు. అయితే అవన్ని ఫలితాలు ఇచ్చాయా లేదా అనేది త్వరలోనే జగన్‌కి కనిపించబోతుంది. ఈ నెలాఖరు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ప్రభుత్వంపైన ప్రజలకు ఏ మేరకు నమ్మకం ఏర్పడిందనేది ఈ ఎన్నికలలో తెలిసిపోతుంది. అయితే ఈ ఎన్నికలలో కూడా మొత్తం క్లీన్‌స్వీప్ చేసి టీడీపీనీ ఇక కోలుకోలేని దెబ్బ తీయాలని ఇప్పటినుంచే ప్లాన్ వేసుకుంటున్నట్టు పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి.