భగవద్గీత, బైబిల్, ఖురాన్ సాక్షిగా.. జగన్ ప్రమాణ స్వీకారం..!

Saturday, June 1st, 2019, 12:23:25 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా వైసీపీ 151 స్థానాలను గెలుచుకోగా, టీడీపీ మాత్రం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అంతేకాదు లోక్‌సభ స్థానాలు కూడా 25 ఉండగా వైసీపీ 22 గెలుచుకోగా, టీడీపీ కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

అయితే 151 అసెంబ్లీ స్థానాలను, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని దేశంలోనే అరుదైన విజయాన్ని నమోదు చేసుకుంది వైసీపీ. అయితే గత తొమ్మిదేళ్ళుగా ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేపట్టి నేనున్నాంటూ పేద జనానికి ఒక భరోసాను కల్పించిన జగన్‌ను నేడు ఆ ప్రజలే ఆశీర్వదించి మరీ గెలిపించుకున్నారు. ఆ గెలుపు మరీ ఇంతలా ఉంటుందని బహుశా జగన్ కూడా ఊహించి ఉండరనిపిస్తుంది. అయితే రెండు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసారు. అయితే ఈ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ఒక ఎత్తైతే, భగవద్గీత, బైబిల్, ఖురాన్, సాక్షిగా ప్రమాణస్వీకారం చేసిన భారతదేశం లోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావడం మరో విశేషం. అంతేకాసు వేద పండితులు, ముస్లిం మత పెద్దలు, ఫాస్టర్‌లు అందరూ కలిసి మంచి పాలన అందించాలని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడాపాలని జగన్‌ను దీవించారు.