వైసీపీ ఎంపీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సీఎం జగన్ – ఎందుకో తెలుసా…?

Wednesday, November 20th, 2019, 01:20:56 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి సీఎం జగన్ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం చదువులను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పు అని, ఇలా చేస్తే తెలుగు భాషకు ఉన్న గౌరవాన్ని మనమే తీసుకున్న వాళ్ళం అవుతామని ప్రతిపక్షాలు అన్ని కూడా అధికార పక్షంపై ఒక తిరుగుబాటు మాదిరిగా యుద్దాన్ని చేస్తున్నాయి కూడా. అయితే ఇదే విషయంలో వైసీపీ పార్టీ నరసాపురం ఎంపీ రఘురాం కృష్ణంరాజు కూడా సీఎం జగన్ కి వ్యతిరేకంగా కొన్ని సంచలన వాఖ్యలు చేశారు.

కాగా తన పార్టీ నేత అయ్యి ఉండి, ఇలా తనపై విమర్శలు చేయడాన్ని సీఎం జగన్ తట్టుకోలేకపోతున్నారు. కాగా సదరు ఎంపీ రఘు రామ్ కృష్ణం రాజు పై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయాలన్నీ కూడా సీఎం జగన్ జిల్లా ఇన్ ఛార్జీ వైవీ సుబ్బారెడ్డితో చర్చించారని సమాచారం. అంతేకాకుండా పాఠశాలల్లో ఇంగ్లీష్ ను వ్యతిరేకిస్తే పేద పిల్లల అభ్యున్నతిని అడ్డుకోవడమేనని జగన్ వాఖ్యానించారని, తాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా ఎవరైనా అనుచిత వాఖ్యలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోడానికి కూడా వెనుకాడనని సీఎం జగన్ వెల్లడించారు.