పవన్ కళ్యాణ్ కి సీఎం జగన్ ఫోన్… ఎందుకంటే…?

Sunday, October 20th, 2019, 02:27:12 AM IST

ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ పార్టీ సృష్టించిన ప్రభంజనానికి మిగతా పార్టీలన్నీ కూడా చతికిల పడిపోయాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే వైసీపీ పార్టీ ఏపీలో ఎప్పుడైతే అధికారాన్ని సొంతం చేసుకుందో ఇక అప్పటినుండి కూడా విపక్షాలన్నీ కూడా వైసీపీ పార్టీ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే జనసేన కూడా ఇటీవల సీఎం జగన్ పై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. అయితే ఈ విమర్శలు అనేవి ప్రస్తుతానికి తీవ్రంగా మారాయని సమాచారం. కాగా ఈమేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో కాసేపు ఫోన్ లో సంబాషించారని సమాచారం.

ఈమేరకు పవన్ కళ్యాణ్ తో సీఎం జగన్ మాట్లాడుతూ… ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం పై ఇలా విమర్శలు చేస్తే ప్రజల్లో ప్రభుత్వం పై నమ్మకం పోతుందని, అలాగే వ్యతిరేకభావన కూడా బాగా పెరుగుతుందని, అందుకనే ఇలాంటి విమర్శలుచేయడం ఆపేయాలని సీఎం జగన్ కోరారట. అయితే ఈమేరకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగానే స్పందించారని సమాచారం. అంతేకాకుండా స్నేహితుడిగా తాను కొన్ని విషయాలకు మాత్రమే మద్దతు ఇస్తానని, అన్నింటికీ ఒప్పికునేది లేదని పవన్ తేల్చి చెప్పేశారంట. అయితే ఈ విషయాన్నీ వైసీపీ నేతలు చాలా గోప్యంగా ఉంచుతున్నారు.