బిగ్ బ్రేకింగ్: ఆ వైసీపీ ఎమ్మెల్యేను ప్రశంసించిన సీఎం జగన్.. కారణమేంటో తెలుసా..!

Tuesday, June 11th, 2019, 05:44:02 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి గత నెల ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే తాజాగా జగన్ తన మంత్రివర్గాన్ని కూడా ప్రకటించి 25 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం కూడా చేయించారు. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూ పాలనలో తనదైన ముద్రను వేసుకుంటున్నాడు జగన్.

అయితే తాజాగా సీఎం జగన్‌కు ఒక పెద్ద సవాలే ఎదురైంది. అది కూడా సొంత పార్టీ ఎమ్మెల్యే ద్వారా. కాశం జిల్లా రాళ్లపాడు పాడు ప్రాజెక్టు వద్ద గత ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయాలంటూ ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. తమ సాగునీటి సమస్యలు తీరాలంటే తక్షణమే రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి కామధేను ప్రాజెక్టుకు నీటి తరలింపును ఆపివేయాలంటూ రైతులు ధర్నాకు దిగారు. అయితే రైతుల ధర్నా విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి కూడా రైతులకు మద్ధతుగా ధర్నాలో పాల్గొన్నారు. రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద వైసీపె అధికార పార్టీ ఎమ్మెల్యేనే ధర్నా చేస్తున్నారంటూ వార్తలు రావడంతో వైసీపీ సీనియర్ నేత వైపీ సుబ్బారెడ్డి అసలు విషయం తెలుసుకుని వెంటనే జగన్‌కి తెలిపారు. అయితే ఈ విషయంపై ఆలస్యం చేయకుండా వెంటనే అధికారులను పిలిపించి రాళ్లపాడు ప్రాజెక్టు సమస్య గురించి తెలుసుకుని గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేస్తామని, రాళ్లపాడు ప్రాజెక్టు నుంచి సాగునీరు ఆ ప్రాంతం రైతులకు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు మరియు ఎమ్మెల్యే తమ దీక్షను విరమించారు. అయితే రైతు సమస్యలపై, ప్రజా సమస్యలపై ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతు సమస్యలపై, ప్రజా సమస్యలపై ఇలాగే పోరాడాలని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని సీఎం జగన్ అభినందించారు. అయితే తమ ఎమ్మెల్యే తమకు మద్ధతు పలికి, తమతో పాటు ధర్నాలో కూర్చొని న్యాయం జరిగేలా చూసిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిపై రాళ్లపాడు ప్రాజెక్టు రైతులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.