బిగ్ బ్రేకింగ్: జగన్ హామీపై చంద్రబాబు ముందస్తు ప్లాన్..!

Thursday, June 6th, 2019, 11:28:22 AM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పటికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత మరొకటి చేసుకుంటూ వెలుతున్నాడు.

అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో జిల్లాల పెంపు కూడా ఒకటి. ఏపీలో ఇప్పుడు ఉన్న జిల్లాలతో పాటు కొత్తగా మరో 25 జిల్లాలను చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అయితే ముందుగా చెప్పినట్టుగానే ప్రతి పార్లమెంట్ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు సీం జగన్ ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్నారు. అయితే జగన్ ఎలాగో కొత్త జిల్లలను చేసి తీరుతాడని గమనించిన చంద్రబాబు కొత్త ప్లాన్ రెడీ చేసుకున్నారు. కొత్త జిల్లాలుగా ఏర్పడబోయే స్థానాలలో జిల్లా స్థాయి పార్టీ కమిటీని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలలో టీడీపీ బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఓటమికి కారణాలు వెతుకుని వచ్చే ఎన్నికలలో అయినా టీడీపీ సత్తా చూపించాలని చంద్రబాబు జగన్ ప్లాన్‌కు ముందస్తు ప్లాన్‌లు వేసుకుంటున్నారట.