జగన్ ఆగ్రహం : ఫైల్స్ విసిరికొట్టి వెళ్ళిపోయాడు..అదేనా కారణం..?

Monday, July 22nd, 2019, 11:01:36 AM IST

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దగ్గర నుండి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో తన దూకుడు చూపిస్తూ ముందుకి దూసుకొనిపోతున్నాడు. చాలా నిర్ణయాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు..మొదటిసారి కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్లను “అన్న” అని పిలిచి అందరికి ఆచ్చర్యపరిచిన జగన్ మోహన్ రెడ్డి, నిన్నటికి నిన్న వాళ్ళ సమావేశంలోనే కోపంతో ఫైల్స్ టేబుల్ మీద విరిసికొట్టి వెళ్లిపోయాడనే వార్తలు వినవస్తున్నాయి.

దానికి కారణం జగన్ చెప్పిన పనిని అధికారులు చేయలేదని తెలుస్తుంది. అధికారులు చేయలేకపోవటానికి అసలు కారణం ఏమిటంటే నిధులు లేకపోవటమే, జగన్ అధికారంలోకి రావటానికి దోహదం చేసినవి “నవరత్నాలు”. వాటిని ఎట్టి పరిస్థితుల్లో అయిన అమలుచేయాలనే ఒకే ఒక లక్ష్యంతో జగన్ పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వాటికి సరిపడినంత బడ్జెట్ అనేది అందుబాటులో లేదనేది వాస్తవం.

అయిన సరే వాటిని ఎలాగైనా అమలు చేసి తీరాలి, అందుకు తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేయండని చూచించారు. వాటిపై కసరత్తు చేసిన అధికారాలు చెప్పిన హామీలు అన్ని నెరవేర్చాలంటే ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిలో వీలుకాదని చెప్పారు. దీనితో ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం జగన్ ఫైల్స్ ను టేబుల్ మీద విసిరికొట్టి మీటింగ్ హాల్ నుండి అర్దాంతరంగా వెళ్లిపోయినట్లు తెలుస్తుంది. ఈ పరిణామంతో అక్కడే ఉన్న అధికారులు షాక్ అయ్యినట్లు తెలుస్తుంది. తర్వాత బయటకు వచ్చి సీఎం గారిని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదంటూ చెప్పారని తెలుస్తుంది.