రాజ్యాంగం 71 ఏళ్ల తర్వాత కూడా మనకు మార్గ నిర్దేశం చేస్తూ ఉంది

Wednesday, January 27th, 2021, 12:00:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 72 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సీఎం జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సామ్రాజ్యవాద శక్తులకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన అద్భుతమైన పోరాటం లో నాయకత్వం వహించిన మన పూర్వీకులు, నాయకులను మనం స్మరించుకుందాం అంటూ చెప్పుకొచ్చారు. అయితే వారు రూపొందించి అందించిన రాజ్యాంగం 71 ఏళ్ల తర్వాత కూడా మనకు మార్గ నిర్దేశం చేస్తూ ఉంది అని అన్నారు. చివరగా జై హింద్ అంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.