ఆ విషయంలో వెనక్కి తగ్గనంటున్న సీఎం జగన్ – ఎందుకు అంతలా…?

Thursday, November 14th, 2019, 12:40:09 AM IST

ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా, ఎన్నో కీలకమైన నిర్ణయాలను తీసుకుంటూ, ఎన్నో విమర్శలు ఎదుర్కుంటూ దూసుకుపోతున్నారు… అయితే సీఎం జగన్ ఇటీవల రాష్ట్రంలోని పాఠశాలల సీషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ఆ నిర్ణయాన్ని రాష్ట్రంలోని విపక్షాలు అన్ని కూడా వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా సీఎం జగన్ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలనే తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సీఎం జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు.

అయితే ఈ విషయంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని, ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం చేస్తే తప్పేంటి అని రాష్ట్ర మంత్రులు అందరు కూడా సీఎం జగన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. కాగా ఈ విషయంలో విపక్షాలు ఎంతగా అడ్డుపడ్డప్పటికీ కూడా వెనక్కి తగ్గేది లేదని చెబుతూ ఈ మేరకు మరొక నిర్ణయాన్ని కూడా తీసుకుంది. కాగా రాష్ట్రంలో ఈ ప్రక్రియ మొదలుపెట్టేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని, వారికి సరైన బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించుకొని, ఐఏఎస్ అధికారి వెట్రిసిల్వికి ఏపీ ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది కూడా. అంతేకాకుండా ఈ విషయంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా వెనక్కి తగ్గొద్దని చెప్పారంట.