బిగ్ బ్రేకింగ్ : రాత్రికి రాత్రే టీడీపీ నేతలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జగన్

Sunday, June 16th, 2019, 02:10:36 PM IST

గత రెండు మూడు రోజుల నుండి మాజీ సీఎం చంద్రబాబు భద్రతా విషయంలో వైసీపీ ప్రభుత్వం కనీస పద్ధతులు పాటించటం లేదంటూ గగ్గోలు పెడుతున్న టీడీపీ నాయకులకు జగన్ శనివారం రాత్రి భారీ షాక్ ఇచ్చాడు. ఏపీలో మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకు ప్రస్తుతం ఉన్న భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీచేసింది. దీనితో ఆదివారం ఉదయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గన్‌మెన్‌లు తమ విధుల నుండి తప్పుకొని, ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయటం జరిగింది. నిజానికి శుక్రవారం సాయంత్రమే అనధికారికంగా ఈ న్యూస్ గన్‌మెన్‌లకు చేరింది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారికీ షిఫ్ట్ కి ఇద్దరు చొప్పున నలుగురు గన్‌మెన్‌లు డ్యూటీ చేసేవాళ్ళు, వాళ్ళని ఇప్పుడు తగ్గించారు. అలాగే MLA లుగా పనిచేసిన వాళ్ళకి ఉన్న ఒకరిద్దరి గన్‌మెన్‌లను తీసేశారు..

పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రులు పితాని, జవహర్‌లకు భద్రతను పూర్తిగా తొలగించినట్టు తెలుస్తోంది. తనకి ముప్పువుందని గన్‌మెన్‌లు కావాలని పితాని కోరిన కానీ, ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకోలేదు. ఇంకొందరు టీడీపీ నేతలు అయితే ముందుగానే తమకు గన్‌మెన్‌లు అవసరం లేదనీ పంపించి తమ మర్యాదని కాపాడుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మాజీ మంత్రులకి, ఎమ్మెల్యేలకి గన్‌మెన్‌లు అవసరం అయితే ప్రభుత్వానికి లేఖ రాయండి. వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అలా కొందరు రాసిన కానీ వాటిని బుట్టదాఖలు చేసేసి, గన్‌మెన్‌లు తీసేస్తున్నారు. దీనిపై కొందరు టీడీపీ నేతలు అఫ్‌లైన్ మాట్లాడుతూ, గన్‌మెన్‌లను తీసేయాలంటే ముందే తీసేయాలి. అలా కాకుండా అవసరం అయితే లేఖ రాయమని చెప్పటం ఎందుకు, రాసిన తర్వాత వాటికీ విలువ లేకుండా చేస్తూ గన్‌మెన్‌లను తీసేయటం ఎందుకు అంటూ గగ్గోలు పెడుతున్నారు..