వెనక్కి తగ్గిన సీఎం – పీపీఏ ల విషయంలో వెనకడుగు

Thursday, September 12th, 2019, 02:41:19 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హాజగన్మోహన్ రెడ్డి మరొకసారి పీపీఏ ల విషయంలో తన మాటని వెనక్కి తీసుకున్నారు. కాగా గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను మళ్ళీ సమీక్షిస్తామని ప్రకటించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇకమీదట వాటిలో జోక్యం చేసుకోనని తాజాగా ప్రకటించారు. కానీ ఇప్పటికి కూడా అమలు కానటువంటి ఒప్పందాలమీద మాత్రమే ద్రుష్టి సారిస్తామని కేంద్ర ప్రభుత్వానికి బుధవారం నాడు సీఎం జగన్ ఒక లేఖ రాసారు. కాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోలు సమయంలో చాలా అవినీతి జరిగిందని ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి, ఎలాగైనా చంద్రబాబు చేసినటువంటి అవినీతిని బయటపెడతామని బహిరంగంగానే ప్రకటించారు. అందుకోసం కొన్ని కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి.

కాగా కడప, అనంత జిల్లాకు చెందిన ఎస్‌బీఈ, అయిన, స్పింగ్ కంపెనీల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేస్తూ పిటిషన్ ని దాఖలు చేశాయి… అయితే దీనిపై పలు విచారణలు జరిపినటువంటి ట్రిబ్యునల్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనిర్ణయంతో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాస్త వెనక్కి తగ్గక తప్పలేదు. ఈమేరకు జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తూ ఇకమీదట గతంలోని విద్యుత్ ఒప్పందాల విషయంలో జోక్యం చేసుకోనని వివరించారు.