ఆ ఘటనపై సీఎం జగన్ సీరియస్.. ఇద్దరు అధికారులు సస్పెండ్..!

Saturday, June 27th, 2020, 03:00:49 AM IST


ఏపీలొని శ్రీకాకుళం జిల్లా పలసలో ఓ వ్యక్తి కరోనా వైరస్ సోకి మరణిస్తే అంత్యక్రియల కోసం అతడి శవాన్ని ఓ ప్రొక్లెయిన్‌లో తీసుకెళ్ళడం తీవ్ర దుమారం రేపుతుంది.

అయితే కరోనా సోకి చనిపోయిన వారి వారిని ఎలా అంతిమ సంస్కారాలు నిర్వహించాలనే అంశంపై గతంలో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్‌ సోకిన వారి విషయంలో వివక్ష లేకుండా వ్యవహరించాల్ని తెలిపింది. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్‌ నివాస్ పలాస మున్సిపల్‌ కమీషనర్‌ టి.నాగేంద్ర కుమార్, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజీవ్‌ను సస్పెండ్‌ చేశారు.