టీడీపీ స్కామ్: నిజంగా వాటి కోసమే ఖర్చుపెట్టారా.. షాక్‌లో సీఎం జగన్..!

Monday, June 3rd, 2019, 04:16:07 PM IST

పీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, స్థితి గతులను చక్కదిద్దే ప్లాన్‌లో నిమగ్నమయ్యారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన కొత్త కొత్త స్కాంలు భయటపడుతున్నాయి.

ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం చేసిన దోపిడీలను, అక్రమాలను ఆధారలతో సహా భయటపెట్టి దేనిలో ఎంత నొక్కేసారో శ్వేత పత్రాలను కూడా విడుదల చేస్తానని జగన్ చెబుతూ వస్తున్నారు. అయితే ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో తెలుసుకోవడానికి ఆయా శాఖలపై అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు సీఎం జగన్. అయితే అందులోనే భాగంగా విద్యాశాఖలో సమీక్ష జరుపుతున్న సమయంలో జగన్‌కే దిమ్మతిరిగే షాకింగ్ కుంబకోణం ఒకటి భయటపడింది. ఏపీ ఉన్నత విద్యామండలిలో పనిచేస్తున్న నలుగురు అధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం గత ప్రభుత్వం మూడేళ్లలో రూ. 18,00,000 ఖర్చు పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఆర్ధిక శాఖలో జరిగిన వేల కోట్ల అక్రమ కేటాయింపులపై చర్చ జరుగుతుండగా ఇప్పుడు ఏపీ ఉన‌్నత విద్యామండలిలో జరిగిన మరో స్కామ్ వెలుగులోకి రావడంతో అధికారులు మరిన్ని శాఖలపై సమీక్షలు నిర్వహించడానికి సిద్దమైపోయారు. గత మూడేళ్లలో ఉన్నత విద్యామండలిలో నలుగురు ఉన్నతాధికారులకు డ్రైఫ్రూట్స్ కోసం అక్షరాలా 18 లక్షల రూపాయలను ఖర్చు పెట్టినా గత ప్రభుత్వం ఎందుకు దీనిని పట్టించుకోలేదనే వాదనలు కూడా ఇప్పుడు తెరమీదకు వచ్చాయి. అయితే ఈ ఇంత పెద్ద మొత్తంలో డ్రైఫ్రూట్స్ ను అధికారిక కార్యక్రమాల సందర్భంగా వాడారా లేక సొంత అవసరాల కోసం వాడుకున్నారా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. అయితే ఇలా అన్ని శాఖలలో జరిగిన అవినీతిని ఒక్కొక్కటిగా వెలికితీసి ఆయా అంశాలను తన శ్వేతపత్రాల విడుదల సందర్భంగా సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలుస్తుంది. దీనిని బట్టి చూస్తుంటేనే గత చంద్రబాబు హయాంలో అవినీతి ఏ విధంగా జరిగిందో అర్ధమవుతుంది అని వైసీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారట.