తెలియకపోతే తెలుసుకోవయ్యా అంటూ చంద్రబాబుకు జగన్ వార్నింగ్..!

Friday, June 14th, 2019, 12:11:41 AM IST

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. నిన్న మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు శాసన సభ్యులుగా ప్రమాన స్వీకారం చేశారు. అయితే నేడు రెండో రోజు సమావేశంలో చర్చలు మాత్రం తార స్థాయికి చేరుకున్నాయి. అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై కన్నెర్ర చేశాడు. దీనితో సభ మొత్తం గందరగోలంగా మారిపోయింది. అయితే వైసీపీ సంఖ్యా బలం ఎక్కువ ఉండడం, టీడీపీ సంఖ్యా బలం తక్కువ ఉన్న కారణం నేపధ్యంలో జగన్ మాటలను ఎవ్వరు ఆపలేకపోయారు.

వైసీపీ అధినేత జగన్ చంద్రబాబులాంటి సీనియర్ నేతను కూడా లెక్క చేయకుండా గతంలో ఆయన ప్రభుత్వంలో చేస్న తప్పిదాల గురించి ఎత్తి చూపాడు. 2014 ఎన్నికలలో మా పార్టీలో గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుతో కొని ప్రజాస్వామ్యాన్ని మంటలో కలిపారు అని అందుకే ఈ సారి ఆ దేవుడు కూడా వారికి తగిన బుద్ధి చెప్పరన్నారు. మా పార్టీ నుంచి అయితే ఎంత మందిని కొన్నాడో అదే 23 స్థానాలకి పరిమితమైందని అన్నారు. నేను చంద్రబాబులాగా విలువలు లేని రాజకీయాలు చేడంలేదని ఒకవేళ అలా చేసి ఉంటే వారికి ఆ ప్రతిపక్ష హోదా కూడా దక్కేది కాదని అన్నారు. అయితే జగన్ అన్న మాటకు అవును అవును మాకు తెలీదులే అంటూ చంద్రబాబు ఎత్తి పొడుపుతో మాట్లాడగా అవునయ్యా తెలియకపొతే తెలుసుకో అంటూ వాస్తవాలివి నేను కూడా నీకులాగా ప్రలోభాలు పెట్టి ఉంటే నేను కూడా నీకులాగా మంత్రి పదవులిస్తా వచ్చేయ్యండని అని ఉంటే నీ స్థానం ఎక్కడ ఉండేదో ఆలోచించుకో అంటూ వేలు చూపించి మరీ కడిగి పారేశారు. సీం జగన్ ఆలా మాట్లాడుతున్నంత సేపు చేసేదేమి లేక చంద్రబాబు బిత్తుర ముఖం వేసుకుని కూర్చున్నాడు.