ప్రమాణస్వీకార సభలో ఆయన క్రేజ్ చూసి జగన్ షాక్ అయ్యాడుగా ..!

Saturday, June 8th, 2019, 04:55:28 PM IST

ఏపీ మంత్రులుగా జగన్ కేబినెట్‌లో 25 మంది మంత్రులు కొద్ది సేపటి క్రితమే ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ సచివాలయ ప్రాంగణంలో వీరితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం మరియు మరికొంత మంది ప్రజాప్రతినిధుల, ఉన్నతాధికారుల మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండుగగా సాగింది. అయితే 25 మంది మంత్రుల ప్రమాణ స్వీకారంలో ఆ ఒక్కడి ప్రమాణస్వీకారం కోసం వైసీపీ అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూసారు.

ఆయన ఎవరో కాదు నెల్లూరు ప‌ట్ట‌ణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్ కుమార్ యాద‌వ్. ఏపీలో ఈయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిది అంటే మాటల్లో చెప్పలేము. యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే నేడు ప్రమాణస్వీకార సభలో ఈయన పేరు పిలవగానే ప్రాంగ‌ణ‌మంతా క‌ర‌తాల ధ్వ‌నుల‌తో మారుమోగిపోయింది. మినిస్ట‌ర్ అనిల్ కుమార్ అనే నినాదాల‌తో హోరెత్తిపోయింది. బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎంట్రీలో వచ్చే గూస్‌బంప్స్ ఇక్కడ కూడా కనిపించాయి. ఈయన క్రేజ్‌ను చూసి కాసేపు జగన్ కూడా ఆశ్చర్యపోయారట. అనిల్ కుమార్ పోలుబోయిన అని ఆయన చెబుతుంటే అందరికి భరత్ అనే సినిమా గుర్తొచ్చిందట. శాస‌నం ద్వారా నిర్మిత‌మైన భార‌త రాజ్యాంగంప‌ట్ల నిజ‌మైన విశ్వాసం. విధేయ‌త చూపుతాన‌ని, భార‌త‌దేశ సార్వ‌భౌమాధికారాన్ని, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుతాన‌ని, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రిగా నా క‌ర్త‌వ్యాల‌ను, శ్ర‌ద్ధ‌తో అంత‌క‌ర‌ణశుద్ధితో నిర్వ‌హిస్తాన‌ని, భ‌యం కానీ, ప‌క్షపాతంకానీ, రాగ‌ద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాస‌నాల‌ను అనుస‌రించి ప్ర‌జ‌లంద‌రికీ న్యాయం చేకూరుస్తాన‌ని దైవ సాక్షిగా ప్ర‌మాణం చేస్తున్నాను అంటూ తన ప్రమాణస్వీకారాన్ని ముగించాడు.