సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా టీడీపీకి పెద్ద దెబ్బేగా..!

Wednesday, June 12th, 2019, 07:23:23 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందే. అయితే నాలుగు రోజుల క్రితం జగన్ తన కేబినెట్‌ను కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అయితే తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నాడు సీఎం జగన్. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా తన మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గానికి 6, బీసీలకు 7, కాపులకు 4, కమ్మ సామాజిక వర్గానికి 1, క్షత్రియ సామాజిక వర్గానికి 1, ఎస్సీలకు 4, ఎస్టీ లకు 1, ఆర్య వైశ్య 1, మైనారిటీ సామాజిక వర్గానికి 1 చొప్పున మంత్రి పదవులు కేటాయించారు.

అయితే మునుపెన్నడూ లేని విధంగా తన వ్యూహాలకు పదును పెట్టి బీసీలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతను కల్పించారు. అంతేకాదు కాపులకు, ఎస్సీలకు కూడా సముచిత స్థానాన్ని కలిపిస్తూ జగన్ తన మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. అయితే గతంలో బీసీలు, కాపులు మరియు ఎస్సీల ఓటు బ్యాంకింగ్ టీడీపీ వైపు ఉండేది. అయితే 2004లో మాత్రం కాపులు కాంగ్రెస్, బీసీలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళారు. అయితే వైఎస్ మరణానంతరం కాపులు మరియు బీసీలు టీడీపీ వైపు మళ్ళారు. అందుకే 2014లో టీడీపీకి విజయం లభించింది. అయితే 2014 టీడీపీ గెలుపులో కీలక పాత్ర పోశించింది కూడా బీసీలు, కాపులేనట. అయితే ఈ సారి ఎన్నికలలో మాత్రం బీసీలు, కాపులు, ఎస్సీలు కూడా వైసీపీ వైపు మళ్ళారని అందుకే టీడీపీ ఓడిపోయిందని గమనించిన సీఎం జగన్ పెద్ద మాస్టర్ ప్లానే వేశారు. తన మంత్రివర్గంలో వీరికి అధిక ప్రాధాన్యత కలిపిస్తే వీరి ఓటు బ్యాంకింగ్ ఎప్పుడూ వైసీపీ వైపే ఉంటుందని భావించారు. అందుకే గతంలో ఎన్నడు లేని విధంగా బీసీలకు 7, కాపులకు 4, ఎస్సీలకు 4 మంత్రి స్థానాలను కలిపించి వీరిని తమ వైపు నిలబెట్టుకునే ప్లాన్ అమలు చేశారు. అయితే ఇది తెలుసుకున్న టీడీపీ ఈ సారి తమ ఓటమికి కారణం తమకు మద్ధతుగా ఉన్న సామాజిక వర్గం మొత్తం వైసీపీ వైపు మళ్లడం, మళ్ళీ జగన్ ఇప్పుడు వారికి ఎక్కువ మంత్రి స్థానాలు కల్పిస్తుండడం చూస్తుంటే రాబోయే ఎన్నికలలో కూడా వీరు టీడీపీ వైపు మళ్ళే సూచనలు కనపడడం లేదంటూ టీడీపీ కాస్త బాధపడుతుందట.