బ్రేకింగ్: టీడీపీ అవినీతిపై జగన్ సంచలన నిర్ణయం.. షాక్‌లో టీడీపీ నేతలు..!

Wednesday, June 26th, 2019, 05:40:25 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తరువాత ఒకటి ఒకటి నెరవేరుస్తుండడమే కాకుండా, అవినీతి లేని పాలనను అందిస్తానని ప్రమాణం కూడా చేసాడు. అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖలలో జరిగిన అవినీతిని, అక్రమాలను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.

అయితే తాజాగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన్ అక్రమ కట్టడాన్ని కూల్చేయించిన జగన్ నేడు విద్యుత్ రంగ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు. ఈ సమావేశంలో సీఎం జగన్ తన సరికొత్త నిర్ణయాన్ని ప్రకటించాడు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో 30 అంశాలపై విచారణ చేయిస్తామని అందుకోసం ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంస్థల సహకారాన్ని తీసుకుంటామని వెల్లడించారు. కరెంటు కొనుగోళ్ల విషయంలో అక్రమాలు జరిగాయని కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ రేట్లకన్నా అధిక రేట్లకు ఎందుకు కొనుగోలు చేసారని అందువలన ప్రభుత్వ ఖజానాకు రూ.2636 కోట్లు నష్టం చేకూరిందని ఈ డబ్బును రికవరీ చేయాలని సీఎం ఆదేశించారు. అంతేకాదు సోలార్, విండ్‌ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని మాట వినకపోతే ప్రభుత్వ ఒప్పందాలు రద్దు చేయాలని ఆదేశిస్తూ ఒక కమీటీనీ ఏర్పాటు చేసారట. అంతేకాదు గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సోలార్, విండ్‌ కంపెనీలతో జరిగిన ఒప్పందాల్లో భారీ దోపిడీ జరిగిందని ఆ అవినీతికి పాల్పడినా ఎంతవారినైనా సరే విడిచిపెట్టేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీచేసాడట. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొందరు టీడీపీ నేతలలో అప్పుడే భయం మొదలైపోయిందని సమాచారం.