బిగ్ డిసీషన్: వైసీపీ మంత్రులపై జగన్ సంచలన నిర్ణయం..!

Tuesday, August 20th, 2019, 09:27:45 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా జగన్ తనదైన శైలిలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే తన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చాలని తన కేబినెట్‌లో కూడా అన్ని వర్గాల వారికి స్థానం కల్పించాడు.

అయితే మంత్రి పదవులు ఆశించి భంగపడిన నేతలకు, తనను నమ్ముకుని పార్టీ కోసం పనిచేసిన వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇస్తున్నాడు. అయితే జగన్ మంత్రివర్గంలో సీనియర్లకు మరియు జూనియర్లకు కూడా జగన్ అవకాశం కల్పించారు. అయితే మొదటి మంత్రివర్గ జాబితాలో స్థానం సంపాదించిన వారు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉంటారని ముందు చెప్పారు. అయితే తాజాగా కొందరు సీనియర్ మంత్రులను మాత్రం ఐదేళ్ళ వరకు కొనసాగించేలా జగన్ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీలో సమాచారాం. అయితే తాజాగా జగన్ మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకట రమణకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఆయనకి 2023 వరకూ ఉండే ఎమ్మెల్సీ స్థానం కల్పించారట. దీనిని బట్టి చూస్తుంటే జగన్ కేబినెట్‌లో మోపిదేవి ఐదేళ్ళ వరకు కొనసాగుతారని తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి జగన్‌కి మోపిదేవి అండగా ఉన్నారని అందుకే ఓడిపోయినా తన మంత్రివర్గంలో స్థానం కల్పించారని అర్ధమవుతుంది. అంతేకాదు రెవిన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పంచాయతిరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మునిసిపల్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, విధ్యుత్ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా ఐదేళ్ళ వరకు మంత్రిస్థానంలో కొనసాగుతారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న జూనియర్ మంత్రుల పనితీరు బాగా ఉంటే వారిని కూడా ఐదేళ్ళు కొనసాగించే అవకాశాలు ఉన్నాయని పార్టీలో వార్తలు వినిపిస్తున్నాయి.