బిగ్ బ్రేకింగ్: ప్రత్యేక హోదా విషయంలో జగన్ సంచలన నిర్ణయం..!

Friday, June 7th, 2019, 12:00:49 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే గత నెల 30వ తేదిన ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుటూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక దాని తరువాత ఒకటి నెరవేరుస్తూనే, గతంలో రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హొదాపై కూడా దృష్టి పెట్టాలని భావిస్తున్నారు.

గతంలో జరిగిన రాష్ట్ర విభజనతో ఆర్థికంగా, అభివృద్ధిప‌రంగా వెనుకబడిపోవడంతో ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే జగన్ దీనిపై పోరాటం చేస్తూ వచ్చారు. అయితే ఐదేళ్ళుగా గత ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదాను తీసుకురావడంలో విఫలమైంది. అయితే ఈ ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి వైసీపీ అధినేత జగన్ ఏపీకి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ప్రమాణస్వీకారం కంటే ముందే ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసిన జ‌గ‌న్ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ గురించి ప్రస్తావించాడు. అయితే ఏపీకి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌న్న డిమాండ్‌ను కేంద్ర ప్ర‌భుత్వం వ‌ద్ద బ‌లంగా వినిపించేందుకు జ‌గ‌న్ సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు కూడా జారీ చేశారు. తన పార్టీలో గెలిచిన ఎంపీలకు కూడా పలు సూచనలు అందించారు. అయితే ఏపీకి ఎలాగైనా ప్రత్యేక హోదా తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ ఏపీకి సంబంధించిన ఆర్థిక స్థితిగ‌తుల‌పై పూర్తి స్థాయి నివేదిక‌ను రూపొందించి రిపోర్టును 15వ ఆర్థిక సంఘం ముందుపెట్టి, ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ను బలంగా వినిపించాలని జగన్ భావిస్తున్నారట.