హాట్ టాపిక్ : మళ్ళీ ఢిల్లీ కి వెళ్ళిన సీఎం జగన్ – పార్టీ నేతల్లో చర్చ…?

Friday, February 14th, 2020, 05:35:29 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఢిల్లీ వెళ్లనున్నారు. ఇటీవలే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయిన సీఎం జగన్, మళ్ళీ ఇంత తక్కువ సమయంలోనే మళ్ళీ ఢిల్లీకి వెళ్లడం పట్ల రాజకీయ వర్గాల్లో ఒకరకమైన చర్చ మొదలైందని చెప్పాలి. కాగా నేడు సాయంత్రం 6 గంటల సమయంలో సీఎం జగన్ మళ్ళీ ఢిల్లీకి వెళ్లనున్నారని సమాచారం. అయితే ఇటీవల ప్రధాని మోడీ తో భేటీ నిర్వహించిన సీఎం జగన్, ఇప్పుడు కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షా తో భేటీ నిర్వహించనున్నారని తెలుస్తుంది. అయితే వరుసగా ఇలా రెండు రోజుల్లో ఢిల్లీ పర్యటనలు నిర్వహించడం పట్ల ఎదో రాజకీయ అవసరం దాగి ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈసారి సీఎం జగన్ రాష్ట్ర రాజధాని, రాష్ట్ర విభజన చట్టం, రాష్ట్ర అభివృద్ధి నిధులపై చర్చించే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా రాష్ట్రంలో మూడు రాజధానులను నిర్మించాలని పట్టుబట్టిన సీఎం జగన్ అందుకనే కేంద్రం నుండి సహాయ సహకారాల కోసమే ఢిల్లీకి వెళ్తున్నట్లు, అంతేకాకుండా రాష్టంలో మూడు రాజధానులను నిర్మించడమే సీఎం జగన్ ప్రధాన ఎజెండాగా మలుచుకున్నాడని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.