అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా బుక్కైన సీఎం జగన్.. అది ఒప్పుకున్నట్టే..!

Thursday, December 12th, 2019, 11:28:05 PM IST

ఏపీలో తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా జరుగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అయితే సభలో మాట్లాడుతూ సీఎం జగన్ ఒక విషయంలో అడ్డంగా బుక్కయ్యారు.

అయితే చంద్రబాబులాగే తమకు మీడియా ఉందని, వారికి ఈనాడు ఎలాగో, మాకు సాక్షి అలాగని అన్నారు. ఈనాడులో చంద్రబాబుకు అనుకూలంగా వార్తలు రాసుకుంటే, సాక్షిలో మాకు అనుకూలంగా వార్తలు రాస్తారని దీని గురుంచి ఇక మాట్లాడే అవసరం లేదని అన్నారు. అయితే ఏదేమైనా మీడియా లేనిదే తాము బ్రతకలేమన్నట్టుగా సీఎం జగనే స్వయంగా ఒప్పుకున్నారు.