కీచ‌క ఎమ్మెల్యేపై ఏపీ సీఎం సీరియ‌స్‌!

Thursday, July 11th, 2019, 07:44:20 AM IST

అతను మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యే, అతని నియోజకవర్గంలో పనిచేస్తున్న ఒక మహిళా కార్యకర్త తనకి ఏమైనా పదవి ఇప్పించండని ఆ ఎమ్మెల్యేని అడిగింది, అయితే ఆ పదవిలో ఉండి, సేవ చేయాల్సిన ఎమ్మెల్యే తన వక్రబుద్ధి చూపిస్తూ, నువ్వు నాకు ఒక పనిచేసి పెట్టు, నేను నీకు కావలసిన పని చేసి పెడుతా అంటూ ఆమెని లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. అవసరం లేకపోయిన ఆమెకి ఫోన్ చేయటం, ఇబ్బంది పెడుతూ మాట్లాడటం, నా కోరిక తీరిస్తే మీ ఆయనకి ప్రమోషన్ ఇస్తాను, నీకు మంచి పదవి ఇస్తానంటూ ఆమెని ఇబ్బంది పెడుతున్నాడు.

దీనితో ఆమె సరాసరి సీఎం ఆఫీస్ కి లేఖ రాస్తూ అతను చేసిన పనులన్నిటినీ ఆధారాలతో సహా జత చేసి సీఎం జగన్ క్యాంపు ఆఫీస్ కి పంపింది. అందులో ఎమ్మెల్యే మాట్లాడిన వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. నేను పదేళ్ల నుండి పార్టీ కోసం పనిచేస్తున్న నాకే పార్టీలో విలువ లేదు. మీరు ఆ ఎమ్మెల్యే మీద ఏమైనా చర్య తీసుకోకపోతే నాకు చావే గతి అంటూ రాసింది. దీనితో జగన్ ఆ ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడితే, నేను అలాంటిది ఏమి చేయలేదని చెప్పుకొచ్చాడు. దీనితో జగన్ వాయిస్ రికార్డ్స్ వినిపించేసరికి బిత్తరపోయిన సదురు ఎమ్మెల్యే తప్పు అయ్యింది, ఇంకెప్పుడు ఇలా చేయనని క్షమాపణ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది ప్రకాశం జిల్లా వైసీపీ క్యాడర్ చర్చ నడుస్తుంది.