ఏపీ లో నేడు జగనన్న వసతి విద్యా దీవెన పథకం ప్రారంభం

Wednesday, April 28th, 2021, 10:22:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు మరొక పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. జగనన్న వసతి విద్యా దీవెన పథకం ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానం ద్వారా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద మొత్తం 1,000.94 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయనున్నారు సీఎం జగన్. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్న ఈ పథకం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆ పథకానికి డబ్బులు ఇవ్వడం అవసరమా అంటూ సూటిగా ప్రశ్నిస్తున్నారు. అసలు ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయా వసతి దీవెన ఇవ్వడానికి అంటూ కొందరు అంటున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో జనాలకు కావాల్సింది ఆసుపత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సరఫరా లతో పాటుగా పలు అత్యవసర సహాయాలు అంటూ చెప్పుకొస్తున్నారు.