ప్రధాని మోదీకి లేఖ రాసిన సీఎం జగన్.. ఎందుకోసమంటే?

Friday, April 16th, 2021, 07:34:33 PM IST

ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. రాష్ట్రంలో టీకా ఉత్సవం విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 6.28 లక్షల డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశామని మరో మూడు వారాల్లో రెండో డోస్ ఇవ్వాల్సి ఉందని లేఖలో తెలిపారు. అయితే రెండు రోజుల క్రిత‌మే కోవిడ్ వ్యాక్సిన్ నిల్వ‌లు జీరోకు పడిపోయాయని రేపు రాష్ట్రానికి 6 ల‌క్ష‌ల డోసులు రానున్నాయని అన్నారు.

అయితే రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడంతో తగినంత సంఖ్యలో డోసులు కేటాయించేలా సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. రాష్ట్రానికి 60 లక్షల కోవిడ్ డోసులు కావాలని లేఖలో విఙప్తి చేశారు. 60 లక్షల డోసులు రాష్ట్రానికి పంపిస్తే 45 ఏళ్లు పైబడిన అందరికీ మొదటి డోసును మూడు వారాల్లో పూర్తి చేస్తామ‌ని చెప్పుకొచ్చారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణకు ప్రధాని తీసుకుంటున్న చర్యలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని లేఖలో ప్రధానిని అభినందించారు.