అప్పట్లో కొండల్ రావ్ అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ – సీఎం కేసీఆర్!

Tuesday, July 28th, 2020, 11:32:15 PM IST


సీఎం కేసీఆర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొండల్ రావు మృతి పై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా ప్రకటన లో సీఎం కేసీఆర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో కొండల్ రావ్ అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉండేవారు అంటూ కొనియాడారు. ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కేసీఆర్ ప్రార్థించారు. కొండల్ రావు బేగంపేట్ వద్ద ఒక ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గుండె పోటు తో మరణించారు. అయితే ఆయన మృతి పట్ల ప్రముఖులు, సినీ పరిశ్రమ కి చెందిన వారు దిగ్రంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.