పంచాయితీ కార్మికులకు శుభవార్త చెప్పిన సీఎం కెసిఆర్…

Tuesday, October 15th, 2019, 12:27:15 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తాజాగా మరొక శుభవార్త చెప్పారు. ఇంతకీ ఆ శుభవార్త ఎవరికంటే గ్రామ పంచాయతీ కార్మికులకు. గ్రామ పంచాయితీ కార్మికుల వేతనాన్ని రూ. 8500 లకు పెంచుతూ సీఎం కెసిఆర్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాగా పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం వేతనాల పెంపుకు సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే గతంలో ఒక్కొక్క కార్మికులకు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వేతనం ఉండేది. కొందరికి చాలా తక్కువ మొత్తంలో వేతనం ఉండేది, మరికొందరికి మాత్రం ఒక మోస్తరులో ఉండేదని సమాచారం. కాగా ఇప్పటినుండి అన్ని పంచాయతీల్లోనూ అందరికి ఒకే న్యాయమైన వేతనం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా ఈమేరకు పెంచిన వేతనాల ప్రకారం వాటికీ సంబందించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సీఎం కెసిఆర్ అధికారికంగా ప్రకటించారు.