సీఎం కేసీఆర్ మరొక కీలక నిర్ణయం – తుపాకుల గూడెం బ్యారేజీకి ఏం పేరు పెట్టారో తెలుసా…?

Thursday, February 13th, 2020, 12:58:03 AM IST

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డప్పటినుండి, రాష్ట్రాన్ని ఎన్నో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ, రాష్ట్ర ప్రజలందరి సంక్షేమం కోసం ఎన్నో కొత్త పథకాల్ని ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్… తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా గోదావరి నది మీద కొత్తగా నిర్మిస్తున్నటువంటి తుపాకుల గూడెం బ్యారేజీకి వనదేవత ‘‘సమ్మక్క’’ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈంరకు తుపాకులగూడెం బ్యారేజీకి ‘‘సమ్మక్క బ్యారేజీ’’ గా నామకరణం చేస్తూ జీవోను జారీ చేయాలని ఇఎన్సీ మురళీధర్ రావు కి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. కాగా రాష్ట్రంలోని కొన్ని బ్యారేజీలకు, రిజర్వాయర్లకు దేవతామూర్తుల పేర్లు పెట్టుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు ప్రగతిభవన్ లో సంబంధిత అధికారులందరితో కూడా ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించుకున్నారు. ఈమేరకు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుకున్న మాదిరిగానే నీరు వస్తుందని, అందుకు గాను రానున్న వర్షాకాలం లోపు నీటిని ఎప్పటికప్పుడు ఎత్తిపోసుకునే దిశగా ఇరిగేషన్ శాఖకి సంబందించిన అధికారులు అందరు కూడా ఇప్పటినుండే అప్రమత్తం కావాలని, సంబంధిత ఏర్పాటు అన్ని పూర్తి చేసుకోవాలని సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. కాగా సీఎం కేసీఆర్ గురువారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టులను సందర్శించడానికి వెళ్లనున్నారు.