కేసిఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకోవటానికి అసలు కారణం ఇదే

Friday, June 14th, 2019, 04:08:42 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంని, ఆ రాష్ట్ర గవర్నర్ ని కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా పిలిచి, అటు నుండి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్లి, అక్కడ రేపు జరగబోయే నీతి ఆయోగ్ సదస్సులో పాల్గొనే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లే ముఖ్యమంత్రి షెడ్యూల్ ఫిక్స్ చేశారని సమాచారం. కాకపోతే మహారాష్ట్ర వెళ్లిన సీఎం కేసీఆర్ అక్కడి సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ని కలిసి, అలాగే రాజ్ భవన్ లోని గవర్నర్ విద్యాసాగర్ రావుని కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధులుగా రావాలని కోరాడు.

అయితే షెడ్యూల్ ప్రకారం ఢిల్లీ వెళ్లకుండా తిరిగి హైదరాబాద్ కి వస్తున్నాడు కేసీఆర్. ఇలా అర్దాంతరంగా టూర్ క్యాన్సిల్ చేయటం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. అవేమిటంటే కేసీఆర్ కి రాష్ట్రలో చాలా నూతనంగా ప్రారభించవలసిన పనులు ఉండటం, దానికి తోడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి కొన్ని పెండింగ్ పనులు కూడా అలాగే ఉండిపోవటం, ఈ నెల 27 దాటితే ఇక మంచి రోజులు లేకపోవటంతో ఆ పనులన్నీ త్వరగా పూర్తిచేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఢిల్లీ టూర్ క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వస్తున్నాడు. ఇక నీతి ఆయోగ్ మీటింగ్ కి ప్రభుత్వం తరుపున ప్రధాన కార్యదర్శిని,మరికొందరు అధికారులను పంపించే అవకాశం ఉందని తెలుస్తుంది.