బీజేపీ నేతలపై మండిపడుతున్న కెసిఆర్ – కారణం అదేనేమో…?

Sunday, September 22nd, 2019, 07:18:27 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా తెలంగాణ లో బలపడాలని ప్రయత్నిస్తున్నటువంటి బీజేపీ పార్టీ అందుకు అనుగుణంగా ప్రణాళిక ప్రకారం బీపీ పార్టీ దూసుకుపోతుంది. కాగా అసమ్మతి నేతలందరినీ కూడా తనతో కలుపుకుపోతున్నటువంటి బీజేపీ, తెలంగాణాలో తెరాస పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అని, రానున్న రోజుల్లో తెరాస పార్టీ ని గద్దె దింపి అధికారాన్ని తామే దక్కించుకుంటామని బీజేపీ గత కొద్దీ రోజులుగా వాఖ్యానిస్తుంది. అయితే ఈ విషయం మీద స్పందించిన తెరాస పార్టీ అధినేత కెసిఆర్ మాట్లాడుతూ… కొత్తగా మతం పుచుకున్నోడికి నామాలు ఎక్కువ అన్న చందంగా బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారని, కెసిఆర్ ఎద్దేవా చేస్తున్నారు. అంతేకాకుండా ఆత్మ గౌరవం విషయంలో రాజీపడే ప్రసక్తి లేదని, ఆ విషయం గురించి బీజేపీ నేతలు తమకి చెప్పాల్సిన అవసరం లేదని కెసిఆర్ చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాలను కొద్దీ పేరు మార్చి బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, ఇలాంటి కాపీ విధానాన్ని బీజేపీ మార్చుకోవాలని కెసిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మరియు బీజేపీ లు ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. అంతేకాకుండా బీజేపీ ఇప్పటికి కూడా ప్రజలందరినీ మోసం చేస్తున్నారని, ఒకవేళ నిజంగానే బీజేపీ పార్టీ తెలంగాణాలో అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజల పరిస్థితి మొత్తం మారుతుందని, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారని కెసిఆర్ వాఖ్యానించారు.