వైద్య, పోలీస్ సిబ్బందికి శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..!

Thursday, April 2nd, 2020, 03:00:17 AM IST

తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపధ్యంలో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకున్న కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే జీతాలలో కోతలు విధిస్తున్నట్టు తెలిపాడు.

అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో కరోనా పేషంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు, లాక్‌డౌన్ నేపధ్యంలో ఎండలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఇచ్చే మార్చ్ నెల జీతాలలో ఎలాంటి కోతలు ఉండబోవని స్పష్టం చేశారు. అంతేకాదు ఈ రెండు శాఖలలో పనిచేసే ఉద్యోగులకు ఇన్సెటివ్ కూడా అందించాలని దానిని కూడా ఈ రెండురోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.