ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపికబురు.. ఇకపై ఫుల్ జీతం..!

Tuesday, June 23rd, 2020, 09:42:03 PM IST

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. కరోనా సంక్షోభం కారణంగా గత మూడు నెలల నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే జీతాలు, పింఛన్లలో కోత విధిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ నేపధ్యంలో ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ సడలింపుల తరువాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడటం, జీతాలు, పింఛన్ల కోతపై ఉద్యోగులు, పెన్షనర్ల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని జూన్ నెలకు సంబంధించి ఫుల్ జీతాలు ఇవ్వనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు.