సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తాం – సీఎం కెసిఆర్

Thursday, September 19th, 2019, 03:00:09 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి కార్మికుల విషయంలో కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. త్వరలోనే సింగరేణి కార్మికుల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, అందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. కాగా సింగరేణి పరిసర ప్రాంతానికి సంబంధించి అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో ఒక సమావేశాన్ని నిర్వహిస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దానికి సంబందించిన విషయాలను చర్చించి, దానికి సంబందించిన పనులన్నీ పరిషక్రించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ ని ఆదేశించారు ముఖ్యమంత్రి కెసిఆర్.

ఇకపోతే అసెంబ్లీ లో సీఎం కెసిఆర్ తన ఛాంబర్ లో బుధవారం సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు బాల్కసుమన్‌, గండ్రవెంకటరమణారెడ్డి, దివాకర్‌రావు, మనమా వెంకటేశ్వర్లు, దుర్గం చిన్నయ్య, సండ్రవెంకట వీరయ్య, రేగ కాంతారావు, హరిప్రియ తదితరులతో సమావేశమయ్యారు. వీరితోపాటు సింగరేణి సీఎండి శ్రీధర్‌, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు కూడా ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసమావేశంలో పలువురు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలని వివరించగా, త్వరలోనే వాటన్నింటిని కూడా పరిష్కరిస్తామని సీఎం కెసిఆర్ హామీ ఇచ్చారు.