స్వల్ఫ అస్వస్థతకు గురైన సీఎం కేసీఆర్ వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి వెళ్ళారు. వైద్య పరీక్షల పూర్తి కావడంతో సీఎం కేసీఅర్ ప్రగతిభవన్‌కు బయల్దేరి వెళ్లారు. అయితే సీఎం కేసీఆర్ ఆరోగ్యం చాలా బాగుందని ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవీ.రావు మీడియాతో చెప్పారు. ప్రతి ఏడాది చేసే వైద్య పరీక్షలే ఆయన చేయించుకున్నారని అన్నారు.
అంతేకాదు ఊపిరితిత్తుల్లో మంట ఉండటంతో సిటీ స్కాన్, బ్లడ్, కొలెస్ట్రాల్, టూడీ ఎకో, ఈసీజీ టెస్టులు చేశామని రిపోర్టులు రేపు వస్తాయని అన్నారు. ప్రస్తుతం ఎంఆర్ఐ స్కానింగ్ అవసరం లేదని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అన్నారు. అయితే కేసీఆర్‌కు కరోనా పరీక్షలు కూడా చేశామని నెగిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ ఆస్పత్రికి వచ్చారు.