వరుణుడి దెబ్బకి వెనక్కి తగ్గిన సీఎం కెసిఆర్…

Friday, October 18th, 2019, 02:00:42 AM IST

సీఎం కెసిఆర్ కి ఈ మధ్య సమయం అసలే కలిసిరావడం లేదని చెప్పాలి. ఒకవైపు ఉప ఎన్నిక తో బిజీ గా ఉండాల్సిన ఈ సమయంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్నటువంటి ఈ సమ్మె కి ఏం చేయాలో తోచని స్థితిలో పడిపోయాడని సమాచారం. కావుగా ఎన్నికలకు సంబంధించి గురువారం నాడు హుజుర్ నగర్ లో నిర్వహించాల్సిన సమావేశం కూడా వరుణుడి కారణంగా రద్దు అయింది. కాగా ఎన్నికల సమయం దగ్గర పడటంతో సీఎం కెసిఆర్ ఘనంగా నిర్వహించాల్సిన సభ కూడా ఆగిపోయింది. అయితే సభ ప్రాంగణంలో భారీగా వర్షం పడటంతో ఆ ప్రాంతం అంత కూడా చివరికి నీటితో నిండిపోయింది.

అయితే ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండడంతో నేతలందరూ కూడా ప్రచారంలో తీవ్రంగా విజయం కోసం శ్రమిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తమ గిరిలోకి వస్తారని తెరాస నేతలందరూ కూడా భావించారు. కానీ ఇలా కూడా తెరాస కి కలిసిరాలేదని చెప్పాలి. అకస్మాత్తుగా తీవ్ర వర్షం పడటంతో అందరు కూడా చేసేదేమి లేక చివరికి సభ రద్దు అయిందని మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. అయితే వర్షం కారణంగా అక్కడి వాతావరణం సరిగా లేకపోవడంతో సీఎం కేసీఆర్ హెలికాప్టర్ వెళ్లడానికి ఏవియేషన్ శాఖ తమ అనుమతులను వెనక్కి తీసుకుంది. ఇలాంటి సమయంలో సీఎం కెసిఆర్ హెలికాఫ్టర్ ప్రయాణం అంత మంచిది కాదని సూచిందరు.