మాట వినకుంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్.. కేసీఆర్ హెచ్చరిక..!

Tuesday, March 24th, 2020, 08:04:42 PM IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మరోసారి అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్ పలు కీలక అంశాలను ప్రెస్‌మీట్‌లో చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఇప్పటివరకు 36 కేసులు నమోదయ్యాయని, అందులో ఒక్కరు డిశ్చార్జ్ అయ్యారని అన్నారు.

అయితే వ్యాధి పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో లాక్‌డౌన్ పాటించకుండా, నియంత్రణ జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరించి సాయంత్రం ఏడు గంటల తరువాత ఎవరైనా రోడ్ల పైకి వస్తే వారి పట్ల పోలీసులు ఇకపై తమ దెబ్బ రుచి చూపిస్తారని అన్నారు. అంతేకాదు పోలీసులకు సహకరించకపోతే 24 గంటల కర్ఫ్యూ విధించాల్సి వస్తుందని, అది కూడా వినకపోతే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. అంతేకాదు అవసరమనుకుంటే ఆర్మీనీ రంగంలోకి దింపాల్సి వస్తుందని ఇలాంటి పరిస్థితులు ప్రజలు కొనితెచ్చుకోవద్దని దయచేసి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా కోరారు.