తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

Tuesday, June 2nd, 2020, 09:17:57 AM IST

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరులకు నివాళి అర్పించారు. ప్రగతి భవన్ నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు, అక్కడ అమరవీరుల సంస్మరణ చేస్తూ, రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటుగా హోమ్ మంత్రి, మేయర్ బొంతు రామ్ మోహన్, పలువురు అధికారులు అమరవీరులకు నివాళులు అర్పించారు.అయితే ప్రగతి భవన్ చేరుకున్న అనంతరం సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరించనున్నారు.తెలంగాణ భవన్ లో ఎంపీ కేశవరావు జెండా ఎగురేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు.

అయితే అసెంబ్లీ లో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ లో జెండా ఎగర వేశారు. అలానే శాసన మండలి లో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ను ఎగర వేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించిన స్పీకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నో దశాబ్దాల పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ను సాధించుకున్నాం అని ఈ నేపధ్యంలో తెలియజేశారు. అంతేకాక ప్రజలు ఎలాంటి తెలంగాణ అయితే కోరుకున్నారు అదే తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారు అని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ది కోసం ఎంతగానో ప్రభుత్వం కృషి చేస్తుంది అని వ్యాఖ్యానించారు.