ఆ ఊరి సర్పంచ్‌కి ఫోన్ చేసిన సీఎం కేసీఆర్.. ఏమన్నాడంటే?

Tuesday, May 26th, 2020, 12:18:50 AM IST

సిద్దిపేట జిల్లాలోని మర్కుక్ గ్రామ సర్పంచ్ భాస్కర్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకుని, కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం గురించి చర్చించారు. అయితే ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

అయితే ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి వస్తారని, ఎంపీపీ, జడ్పీసీటీలను పిలిపించుకుని ఊరి వాళ్లతో కలిసి పూలు చల్లి, కొబ్బరికాయలు కొట్టి ప్రాజెక్ట్ ప్రారంభించుకోవాలని సీఎం కేసీఆర్ గ్రామ సర్పంచ్ భాస్కర్‌కు సూచించారు. అంతేకాదు జలాశయం వద్ద పర్యాటక అభివృద్ధికి 15 ఎకరాలు ఎంపిక చేయాలని, మర్కూక్ గ్రామ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని కూడా సూచించారు.