బ్రేకింగ్: ఎట్టకేలకు ప్రగతి భవన్ చేరుకున్న సీఎం కేసీఆర్..!

Saturday, July 11th, 2020, 05:47:10 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎట్టకేలకు నేడు ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. ప్రగతి భవన్‌లో కరోనా కేసులు భయటపడడంతో దాదాపు రెండు వారాల పాటుగా ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.

#WhereisKCR పేరుతో అధికార విపక్షాల మధ్య తీవ్ర విమర్శలు జరిగాయి. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ కనిపించకుండా ఫాం హౌస్‌లో ఉండడంతో సామాన్యుల నుంచి కూడా విమర్శలు మొదలయ్యాయి. అయితే వీటన్నిటికి చెక్ పెడుతూ రెండు వారాల తరువాత సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ చేరుకున్నారు. ఇకపోతే రాబోయే రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో రైతులతో సమావేశం కానున్నారని సమాచారం.