మిశ్రమంగా సీఎం కేసీఆర్‌ కరోనా రిపోర్టులు.. ఆర్టీపీసీఆర్ టెస్టులో రాని ఖచ్చిత ఫలితం..!

Friday, April 30th, 2021, 02:00:21 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే నిన్న సీఎం కేసీఆర్‌కు వైద్యులు ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌తో పాటు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా ర్యాపిడ్ టెస్ట్‌లో నెగెటివ్ అని వచ్చింది. దీంతో అందరూ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కాన్నీ నేడు వచ్చిన ఆర్టీపీసీఆర్ పరీక్షల ఫలితాలు మాత్రం మిశ్రమంగా వచ్చినట్టు సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు తెలిపారు.

అయితే నిన్న యాంటిజెన్ టెస్ట్‌ రిపోర్ట్‌లో సీఎం కేసీఆర్ కరోనా నెగిటివ్ వచ్చిందని, ఆర్టీపీసీఆర్ పరీక్ష రిపోర్ట్‌లో మాత్రం ఖచ్చితమైన ఫలితం రాలేదని వైరస్ తగ్గు ముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్ ఎంవీ రావు అన్నారు. అయితే సీఎం కేసీఆర్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని రెండు మూడు రోజుల్లో మరోసారి సీఎం కేసీఆర్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.