సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం – ఇకనుండి బాటిల్ లో పెట్రోల్ బంద్

Wednesday, November 13th, 2019, 12:04:49 AM IST

తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తాజాగా మరొక సంచలనమైన నిర్ణయాన్ని స్తీసుకున్నారు. అదేంటో తెలుసా… ఇకనుండి బాటిల్ లో పెట్రోల్ పోయారంట. అయితే ఇటీవల జరిగినటువంటి ఎమ్మార్వో హత్య కేసు వల్లే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడని తెలుస్తుంది. కాగా మనం సాధారణంగా మన వాహనం ఎక్కడైనా పెట్రోల్ లేకుండా ఆగిపోతే, ఆ వాహనాన్ని అక్కడే నిలిపివేసి దగ్గర్లోని పెట్రోల్ బంక్ లో బాటిల్ తో పెట్రోల్ తెచ్చుకొని మరీ మన బండి లాగిస్తాం. అయితే ఇకనుండి అలాంటివి కుదరదని సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారని సమాచారం.

కాగా ఇటీవల సురేష్ అనే వ్యక్తి ఎమ్మార్వో కార్యాలయానికి బాటిల్ లో పెట్రోల్ తీసుకెళ్లి, నిప్పంటించి ఎమ్మార్వో ని హత్య చేశారు. కాగా ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి సంబందించిన బోర్డులు ఇప్పటికే పలు పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్నాయి కూడా.