సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి.. బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్వీట్..!

Tuesday, April 20th, 2021, 12:00:34 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్‌పై ఎప్పుడు మండిపడే బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంది. సీఎం కేసీఆర్ గారు కరోనా నుంచి త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ఇకపోతే సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్, కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా కేసీఆర్ త్వరగా కోలుకుంటారని ట్వీట్లు చేశారు.

అయితే సీఎం కేసీఆర్ గారికి స్వల్ప లక్షణాలతో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, వైద్యుల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని, ప్రజల ఆశీర్వాదాలతో, దేవుడి దీవెనలతో కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కవిత ట్వీట్ చేయగా, సీఎం కేసీఆర్ చాలా గట్టి వారని, పోరాట యోధుడని మీ అందరి ప్రార్ధనలతో ఆయన త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్ చేశారు.