అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..!

Thursday, January 21st, 2021, 05:25:53 PM IST

తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ తీపికబురు అందించారు. 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అయితే దీనిపై రెండు రోజుల్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇప్పుడు EWS 10 శాతం రిజర్వేషన్లతో కలుపుకుని 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

అయితే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు వారికి కేటాయించిన రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో 10 శాతం EWS రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.